29న బీజేపీ ఆఫీస్​ ముట్టడిస్తాం

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనికి నిరసనగా ఈనెల 29న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని పాలమూరు యువగళం వ్యవస్థాపక అధ్యక్షుడు టీకే శివప్రసాద్  తెలిపారు. గురువారం పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా తీసుకురావడం తెలంగాణ ఎంపీలకు సాధ్యం కాలేదని విమర్శించారు.

పాలమూరు ప్రాజెక్టుకు బీజేపీ ప్రాణం పోస్తుందని డీకే అరుణను ఎంపీగా గెలిపిస్తే, తమ గొంతు నులిమారని ఆవేదన వ్యక్తం చేశారు. చుక్క రవి, బి రాము, కె భరత్, మహేశ్, బాలు, రవినాయక్, రమేశ్​తదితరులు  పాల్గొన్నారు.