మన్యంకొండ అభివృద్ధి కోసం టీటీడీకి ప్రతిపాదన

మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అలివేలు మంగ ఆలయ అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థికసాయం కోసం బుధవారం ప్రతిపాదనలు పంపించారు. టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్  నందిని, ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా కార్యక్రమాల నిర్వాహకుడు డాక్టర్  ఉత్తరపల్లి రామాచార్యులు ఆలయాన్ని సందర్శించారు.

మన్నెంకొండ దేవస్థానం అధికారులు అలివేలు మంగ ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలను వారికి అందించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్, ఈవో జి. శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాస్ శర్మ, ఏఈ కె. బాలయ్య, సూపరింటెండెంట్  నిత్యానందం పాల్గొన్నారు.