అణు శాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత

ప్రముఖ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ ఆర్ చిదంబరం(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (జనవరి 04) ఉదయం ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

చెన్నైలో జన్మించిన చిదంబరం, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి PhD పొందారు. ఈయన 1962లో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో చేరారు. 1993లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌గా బాధత్యలు చేపట్టిన ఈయన 2000 వరకు ఆ పదవిలో కొనసాగారు.

1975, 1998లో భారత ప్రభుత్వం జరిపిన పోఖ్రాన్-1, పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించిన అతికొద్ది మంది శాస్త్రవేత్తలలో చిదంబరం ఒకరు. ఈయన భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గానూ పని చేశారు. ఈయనను ప్రభుత్వం పద్మశ్రీ(1975), పద్మవిభూషణ్‌(1999)లతో సత్కరించింది.