నిట్ యూనివర్సిటీ అధ్యక్షునిగా ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా

నిట్ యూనివర్సిటీ అధ్యక్షునిగా ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా

న్యూఢిల్లీ:  నిట్ యూనివర్సిటీ అధ్యక్షునిగా పూర్వ ఐఐటియన్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నా నియమితులయ్యారు. గతంలో ఐఐటీ ఢిల్లీలో ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌ డీన్‌గా సేవలనందించారాయన. ఐఐటీ ఢిల్లీలో 23 సంవత్సరాల పాటు  ఫ్యాకల్టీ, అడ్మిన్‌స్ట్రేటివ్‌ స్ధానాల్లో పనిచేసిన  ప్రొఫెసర్‌ ఖన్నా, అక్కడ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ వైస్‌ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. తన  బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీని కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ఐఐటీ కాన్పూర్‌ నుంచి చేశారు. సిడ్నీలోని న్యూసౌత్‌ వేల్స్‌ యూనివర్శిటీలో హానరరీ విజిటింగ్‌  రీసెర్చ్‌ ఫెలోగానూ సేవలను అందించారు.
ప్రొఫెసర్‌ ఖన్నాను స్వాగతించిన నిట్‌ యూనివర్శిటీ ఫౌండర్‌  రాజేంద్ర ఎస్‌ పవార్‌ మాట్లాడుతూ గత 18 నెలల కాలంలో కరోనా మహమ్మారి మనందరికీ విద్యావ్యవస్థను, మన ఎస్సెస్‌మెంట్‌  నమూనాలను పునః సమీక్షించుకునే అవకాశం కల్పించిందని గుర్తు చేశారు.  ప్రొఫెసర్‌ ఖన్నా మార్గనిర్దేశకత్వంలో భవిష్యత్‌ తరాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 
నిట్‌ యూనివర్శిటీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నా మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభావంతులు తీర్చిదిద్దిన సంస్థలో చేరడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా అన్నారు. యూనివర్శిటీని నూతన శిఖరాలను తీసుకువెళ్లడానికి నావంతు కృషి చేస్తానని అన్నారు.