హైదరాబాద్​లో ప్రొడక్ట్ ఇన్నోవేషన్​ ఫెసిలిటీ

హైదరాబాద్​లో ప్రొడక్ట్ ఇన్నోవేషన్​ ఫెసిలిటీ

హైదరాబాద్, వెలుగు: లైఫ్​సైన్సెస్​, సెమీకండక్టర్​ కంపెనీలకు రెవెన్యూ ఆప్టిమైజేషన్​, కాంప్లయన్సెస్​ సాఫ్ట్​వేర్లు తయారు చేసే అమెరికా కంపెనీ మోడల్​ ఎన్​ హైదరాబాద్​లో తన ప్రొడక్ట్ ఇన్నోవేషన్​ ఫెసిలిటీని ప్రారంభించింది.  70 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన మోడల్ ఎన్​ ఫెసిలిటీలో 500 మంది ఉద్యోగులు పనిచేస్తారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్,  మోడల్ ఎన్​  ప్రెసిడెంట్ & సీఈఓ జేసన్  బ్లెస్సింగ్  దీనిని ప్రారంభించారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మోడల్ ఎన్​ సెంటర్ కొత్త  ప్రొడక్ట్​ ఇన్నోవేషన్లను మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. స్టేట్​ ప్రైస్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పరెన్సీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, 340 బీ సొల్యూషన్స్ ఫార్మా కంపెనీలకు ఉపయోగపడతాయి.

ఫ్లూయిడ్ డ్రగ్ ప్రైసింగ్ రెగ్యులేషన్  మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్​లో వీటిని వాడుతారు.  ఆపరేషన్స్​ను సక్రమంగా నిర్వహించేలా చేయడమేగాక, రిస్కులను తగ్గిస్తాయి. -ప్రస్తుతం టాప్ 30 గ్లోబల్ లైఫ్ సైన్సెస్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లలో 28  కంపెనీలతో కలిసి మోడల్​ ఎన్​ పనిచేస్తోంది. 20 గ్లోబల్​ సెమీకండక్టర్ బ్రాండ్లలో 14  కంపెనీలకు సేవలు అందిస్తున్నది. ఈ సందర్భంగా జయేష్​ రంజన్​ మాట్లాడుతూ హైదరాబాద్​లో 800 ఫార్మా కంపెనీలు, 28 వరకు సెమీ కండక్టర్​ కంపెనీలు ఉన్నాయన్నారు.  స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఓఈఎంలు,  థింక్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌లు,  గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలను ఆకర్షించగల సామర్థ్యం మోడల్​ ఎన్​కు ఉందన్నారు.