DaakuMaharaj: మా సినిమాకు టికెట్ రేట్ల పెంపు అవసరం లేదు.. ప్రొడ్యూసర్ నాగ వంశీ కామెంట్స్ వైరల్

బాబీ కొల్లి డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన మూవీ డాకు మహారాజ్ (Daaku Maharaj ). ఈ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాపంగా రిలీజ్ కానుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచిన మేకర్స్.. మంగళవారం జనవరి 7న ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మాట్లాడుతూ.. "మా సినిమాకు టికెట్ల రేట్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు.  ఇప్పుడున్న ధరలతోనే రిలీజ్ చేస్తున్నాం. మాకు ఇప్పటికే ఏపీలో టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం పర్మిషన్ వచ్చింది. అయితే, తెలంగాణలో పెంపు కోసం అడగటం లేదు. నైజాం ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న టికెట్ల ధరలపై నేను సంతోషంగానే ఉన్నాను. టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరలేదు. అలాగే డాకు మహారాజ్ తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులను  అసలు నిరాశపరచదు. బాలకృష్ణ గారి కెరీర్‌‌‌‌లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని" నాగ వంశీ అన్నారు. ఏపీలో టికెట్ల రేట్ చూసుకుంటే.. సింగిల్ స్క్రీన్ లో రూ.110, మల్టీప్లెక్స్ అయితే రూ.135 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ఇకపోతే డాకు మహారాజ్ సినిమా నైజాం, ఏపీలో కలిపి మొత్తం రూ.73కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగిందని సమాచారం.అందులో నైజాం ఏరియాల్లో రూ.21 కోట్లకు(18కోట్లు అని మరో టాక్‌) అమ్ముడు పోయిందట. ఇక ఏపీలో రూ.51కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అలాగే సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది.

ALSO READ : అభిషేక్ నామా దర్శకత్వంలో నాగబంధం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్

ఇందులో సీడెడ్‌లో రూ.16కోట్లు, ఆంధ్రాలో రూ.35కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు టాక్. ఆంధ్రాలో ఉత్తరాంధ్ర రూ.8.40కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.6.30కోట్లు, వెస్ట్ రూ.5 కోట్లు, కృష్ణ రూ.5.60, గుంటూరు రూ.7.20, నెల్లూరు రూ.2.80కోట్ల బిజినెస్‌ జరిగిందని సినీ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ రూ.73కోట్ల బిజినెస్ చేసుకుంది.