క్రిప్టో పేరుతొ 1,200 కోట్ల మోసం!

క్రిప్టో పేరుతొ 1,200 కోట్ల మోసం!

న్యూఢిల్లీ: కొత్తగా క్రిప్టో కరెన్సీని ఇష్యూ చేస్తున్నామని చెప్పి మొత్తం 900 మంది ఇన్వెస్టర్ల నుంచి రూ. 1,200 కోట్లను కొట్టేశాడు  కేరళకు చెందిన ఓ బిజినెస్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్‌‌‌‌ఏ) కింద ఆయనకు చెందిన ఆస్తులను ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ అధికారులు అటాచ్ చేశారు.  నిషద్ కే, ఆయన అనుచరులు ‘మోరిస్‌‌‌‌ కాయిన్‌‌‌‌ క్రిప్టోకరెన్సీ’ ని లాంచ్ చేస్తామని చెప్పి, డిపాజిటర్ల నుంచి డబ్బులు లాగారు. నిషద్ , అతని కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను, ల్యాండ్‌‌‌‌ను, క్రిప్టో కరెన్సీని ఈడీ అటాచ్ చేసింది.  మొత్తం 36.72 కోట్ల విలువైన ఆస్తులను  అటాచ్ చేసింది.   మోరిస్ కాయిన్‌‌‌‌ పేరుతో నిషద్  తన కంపెనీలయిన లాంగ్ రిచ్ గ్లోబల్‌‌‌‌, లాంగ్ రిచ్ టెక్నాలజీస్‌‌‌‌ వంటి వాటి ద్వారా డబ్బులు సేకరించారు.