అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ ఆపరేషన్ బ్లూస్టార్ డే కావడంతో చాలా మంది గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే చాలా మంది ఖలిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. వీరు కత్తులు చూపుతూ.. ఖలిస్తానీ లీడర్ జర్నైల్ బింద్రాన్ వాలే ఫోటోలు ప్రదర్శించారు. అక్కడ శిరోమణి అకాళీదల్ నాయకుడు మాజీ ఎంపీ సిమ్రాన్ జిత్ సింగ్ మాన్, ఆ పార్టీ నాయకులు కూడా కనిపించడం గమనార్హం.
మరిన్ని వార్తలు
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
నుపుర్ శర్మకు బెదిరింపులు
