పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 11వ ఎడిషన్‌లో హర్యానా స్టీలర్స్, పట్నా పైరేట్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో స్టీలర్స్ 28–25తో యూపీ యోధాస్ విజయం సాధించి వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. హర్యానా జట్టులో శివం పతారె (7 పాయింట్లు), వినయ్ (6), డిఫెండర్ రాహుల్ (5) రాణించారు. యూపీ రైడర్ గగన్ గౌడా (10) సూపర్ టెన్‌తో పోరాడినా ఫలితం లేకపోయింది. రెండో సెమీస్‌లో పట్నా 32–28తో దబాంగ్ ఢిల్లీ కేసీని ఓడించింది. పట్నా జట్టులో దేవాంక్, అయాన్ చెరో ఎనిమిది పాయింట్లతో సత్తా చాటారు. ఆదివారం జరిగే ఫైనల్లో హర్యానా, పట్నా అమీతుమీ తేల్చుకుంటాయి.
We have our ????????? ?
— ProKabaddi (@ProKabaddi) December 27, 2024
It's ???????? ⚔️ ??????? in the GRAND FINALE of #PKL11 ?#ProKabaddi #PKL11 #LetsKabaddi #ProKabaddiOnStar #PKLPlayoffs pic.twitter.com/bt3O5Qg6Cz