రాజ్యాంగంపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లండి : ప్రియాంక గాంధీ

  • ఎంపీ అనిల్ యాదవ్​కి సూచించిన ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ దిశా నిర్ధేశం చేసినట్లు ఆ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని 10 జన్ పథ్ లో ప్రియాంక గాంధీని అనిల్ కుమార్ మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన ప్రియాంకకు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం సుమారు 20 నిమిషాలు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పాలన, ఆరు గ్యారంటీల అమలుపై ఇరువురూ చర్చించారు.