విద్యుత్ ​సంస్థలను ప్రైవేటీకరిస్తే సహించేది లేదు

  • స్టేట్​ పవర్ ​ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: విద్యుత్​ సంస్థలను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని స్టేట్ పవర్ ఎంప్లాయిస్​ జాయింట్​ యాక్షన్ కమిటీ హె చ్చరించింది. గురువారం సదరన్​ డిస్కం కార్పొ రేట్​ఆఫీస్​ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్​ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్​ జేఏసీ చైర్మన్​ సాయిబాబా మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో నైనా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే ఆ రాష్ట్రాల ఉద్యోగులకు తాము మద్దతు తెలుపుతూ ఆందోళన చేస్తామని తెలిపారు. ‘నేషనల్  కో -ఆర్డినేషన్ కమిటీ అఫ్ ఎలక్ట్రిసిటీ  ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్’  పిలుపు మేరకు విద్యుత్ సంస్థలను ఉత్తరప్రదేశ్,  చండీగఢ్  ప్రైవేటు పరం చేయాలని భావిస్తున్నాయని..ఈ ప్రయత్నాన్ని తప్పకుండా అడ్డుకుంటామని అన్నారు.