35 మందికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు
విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద సిరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో గాయపడిన వారందరినీ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన వైద్యo కోసం విజయవాడ తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు లో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది విశాఖపట్టణం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. అయితే బస్సులో సరిగ్గా ఎంత మంది ప్రయాణిస్తున్నారనేది తెలియరాలేదు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను క్షతగాత్రులను పరామర్శించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లతోపాటు.. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
