పంజాగుట్టలో స్కూటీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్.. బీటెక్ విద్యార్థి మృతి

హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది.    స్కూటీ పై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో  లోకేష్ ( 20)  బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  

Also Read :- మలేరియాకు మరో వ్యాక్సిన్..ఇండియా నుంచే ఇది రాబోతుందా..?

బస్సు డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు.  డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.