గుడ్ న్యూస్..7 లక్షల ఉద్యోగాలు వస్తాయ్!

గుడ్ న్యూస్..7 లక్షల ఉద్యోగాలు వస్తాయ్!

న్యూఢిల్లీకొత్త ఏడాదిలో నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్ చెప్పబోతున్నాయి ప్రైవేట్ రంగ కంపెనీలు. 2020లో ఈ రంగంలోని కంపెనీలు ఏడు లక్షల ఉద్యోగాలను సృష్టించబోతున్నాయని తాజా సర్వే చెప్పింది. అంతేకాక న్యూఇయర్‌‌‌‌లో మొత్తంగా జీతాలు కూడా 8 శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. మైహైరింగ్‌‌క్లబ్‌‌ డాట్ కామ్, సర్కారీ నౌకరి డాట్ ఇన్ఫో ఎంప్లాయిమెంట్ ట్రెండ్ సర్వే(ఎంఎస్‌‌ఈటీఎస్) 2020లో ఈ విషయం వెల్లడైంది. చాలా కంపెనీలు తమ నియామకాల ప్లాన్స్‌‌పై ఆశావాదంతో ఉన్నట్టు పేర్కొంది. ‘కొత్త క్యాలెండర్ ఇయర్ 2020లో సుమారు 7 లక్షల ఉద్యోగాలను ప్రైవేట్ కంపెనీలు జనరేట్ చేయనున్నాయి. వీటిలో ఎక్కువగా  స్టార్టప్స్‌‌ ఉంటాయి. ప్రతి రంగంలో కూడా చాలా ఉద్యోగాలను ఇవి క్రియేట్ చేస్తాయి’ అని మైహైరింగ్‌‌ క్లబ్‌‌ డాట్ కామ్, సర్కారీ నౌకరి డాటా ఇన్ఫో సీఈవో రాజేష్ కుమార్ చెప్పారు. ఈ సర్వే42 మేజర్ సిటీల్లోని 12 ఇండస్ట్రీ సెక్టార్లలో ఉన్న 4,278 కంపెనీలను కవర్ చేసింది. 5,14,900 ఉద్యోగాలను సృష్టించడంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణేలు టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్నాయి. మిగిలిన ఉద్యోగాలను కంపెనీలు టైర్ 2, టైర్ 3 నగరాల్లో కల్పిస్తాయి. ‘ఖర్చును అదుపులో ఉంచుకోవడానికి కంపెనీలు వారి కార్యాలయాలను మెట్రోల నుంచి ఇతర నగరాలకు మార్చుతుండటంతో, టైర్ 2, 3 నగరాల్లో మరిన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. 2020లో ఇతర స్కిల్స్ కంటే టెక్నాలజీ లేదా టెక్నాలజీ స్కిల్స్‌‌కు  ఎక్కువ డిమాండ్‌‌ ఉంటుంది’ అని రాజేష్ పేర్కొన్నారు. 2019లో 5.9 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాయని అంచనా వేయగా.. 6.2 లక్షల ఉద్యోగాలను కంపెనీలు అందించాయి.

రిటైల్, ఈకామర్స్‌‌లదే ముందంజ….

2020లో 1,12,000 ఉద్యోగాల కల్పనతో రిటైల్, ఈకామర్స్ రంగాలే ముందంజలో ఉంటాయి. ఆ తర్వాత ఐటీ అండ్ ఐటీఈస్ రంగాల్లో 1,05,500 ఉద్యోగాలు , ఎఫ్‌‌ఎంసీజీలో 87,500, మానుఫ్యాక్చరింగ్‌‌లో 68,900, బీఎఫ్‌‌ఎస్‌‌ఐలో 59,700, హెల్త్‌‌కేర్‌‌‌‌లో 98,300 ఉద్యోగాలు వస్తాయని సర్వే పేర్కొంది. 2020లో కూడా సౌత్ జోనే ఉద్యోగాల కల్పనలో నెంబర్ వన్ పొజిషన్‌‌లోఉండనుంది. ఇక్కడ 2,15,400 ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. ఆ తర్వాత నార్త్‌‌లో 1,95,700 ఉద్యోగాలు, వెస్ట్‌‌లో 1,65,700 ఉద్యోగాలు, ఈస్ట్‌‌లో 1,25,800 ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. సర్వే ప్రకారం, జీతాలు, బోనస్‌‌లు సింగిల్ డిజిట్‌‌లోనే పెరుగుతాయి. మొత్తంగా జీతాల ఇంక్రిమెంట్‌‌ 8 శాతంగా ఉండబోతుందని సర్వే అంచనావేసింది. ఇంక్రిమెంట్స్ 8 శాతం, బోనస్‌‌లు 10 శాతం పెరుగుతాయని తెలిపింది.  గతేడాదితో పోలిస్తే… బోనస్‌‌లు, ఇంక్రిమెంట్ల పర్సంటేజ్‌‌ మొత్తం మీద 1 శాతం పాయింట్స్ పెరిగే అవకాశం ఉందని కుమార్ చెప్పారు.

రీస్కిలింగ్ అవసరం…

2020లో ప్రస్తుత ఉద్యోగులకు రీస్కిలింగ్‌‌ అనేది చాలా ముఖ్యమైనదని షైన్ డాట్ కామ్ సీఈవో జైరస్ మాస్టర్ చెప్పారు. స్కిల్‌‌ కొరతను ఎత్తి చూపించిన మాస్టర్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్‌‌లో మారుతోన్న రోల్స్‌‌ను ఎంత త్వరగా అయితే అడాప్ట్ చేసుకుంటారో వారిపైనే రిక్రూటర్లు ఎక్కువగా ఫోకస్ చేశారని తెలిపారు. పెద్ద మొత్తంలో డేటాను ఎవరైతే, రీడ్ చేసి, అనాలసిస్‌‌ చేస్తారో ఆ ప్రొఫెషనల్స్‌‌పైనే ఎక్కువగా కంపెనీలు మొగ్గుచూపుతాయని పేర్కొన్నారు.