కూకట్​పల్లిలో ప్రైవేట్​ బస్సు బీభత్సం

  • వృద్ధుడు మృతి..నాలుగు కార్లు ధ్వంసం

  కూకట్​పల్లి, వెలుగు:  కూకట్​పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్​ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్​ నిర్లక్ష్యం, ఓవర్​ స్పీడ్​ గా నడపడంతో వృద్ధుడు చనిపోయాడు. నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. కూకట్​పల్లిలో ఉండే నారాయణ్​ అనిల్​కుమార్​  కేపీహెచ్​బీకాలనీలో టెంపుల్​ బస్టాప్​లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు.  డ్యూటీ ముగించుకుని  స్కూటీపై  సోమవారం రాత్రి   ఇంటికి బయలుదేరాడు.  11 గంటలకు కూకట్​పల్లి   పిల్లర్​ నెంబర్​ 816 వద్ద వెనుక నుంచి వచ్చిన కాకతీయ ట్రావెల్స్​ బస్సు  ఢీకొట్టటంతో తీవ్రంగా గాయపడ్డాడు.  స్కూటీతో పాటు ముందు ఉన్న కార్లను కూడా బస్సు ఢీకొట్టటంతో  వరుసగా నాలుగు  కార్లు ధ్వంసమయ్యాయి. బాధితుడిని  దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ 
మంగళవారం    చనిపోయాడు.  

బైకు ఢీ కొనడంతో .. 

కేపీహెచ్​బీ పోలీసుస్టేషన్​ పరిధిలో రెండు బైకులు ఢీ కొనడంతో    ఏపీలోని పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన మున్నంగి పవన్​కుమార్​రెడ్డి(26)  చనిపోయాడు.  సంవత్సరం క్రితం నగరానికి వచ్చిన పవదన్​ ఆరో ఫేజ్​లోని హరిహర మెన్స్​ పీజీలో ఉంటూ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి బైక్​పై  శ్రీల ప్రైడ్​ పార్క్​ నుంచి గోకుల్​ ప్లాట్స్​  వెళ్తుండగా అతి వేగంతో వచ్చిన మరో బైక్​ ఢీకొట్టింది. దీంతో కిందపడ్డ పవన్​కుమార్​రెడ్డి  స్పాట్​లోనే మృతి చెందాడు.   
పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మండలం నరసయ్య గూడ గేట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖుదా వందపూర్ కు చెందిన ఈడిగి ఆంజనేయులు (41), అల్లాపూర్ గ్రామానికి చెందిన సున్నాల ఆంజనేయులుతో కలిసి కలిసి మంగళవారం మధ్యాహ్నం పరిగికి వచ్చాడు. తిరిగి ఖుదాన్పూర్ వెళ్తుండగా పరిగి నుంచి షాద్​నగర్​వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులును పరిగి దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఆంజనేయులు గాయపడ్డాడు. పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.