Ranji Trophy 2024-25: బరువు తగ్గుతలే.. బాడీలో 30 శాతం కొవ్వు: ముంబై నుండి పృథ్వీ షా ఔట్

టీమిండియా యువ అతగాడు పృథ్వీ షా  గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 18 ఏళ్ళ వయసులోనే భారత జట్టులోకి వచ్చి తొలి టెస్టులోనే సెంచరీ చేసి భవిష్యత్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అతని కెరీర్ చేజేతులా తానే నాశనం చేసుకుంటున్నాడు. భారత జట్టులో ఎప్పుడో స్థానం కోల్పోయిన షా.. తాజాగా రంజీల్లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ముంబై తదుపరి త్రిపురతో ఆడబోయే మ్యాచ్ లో ఈ 24 ఏళ్ళ బ్యాటర్ కు చోటు దక్కలేదు. 

ఫామ్ పరంగా తొలి రెండు మ్యాచ్ ల్లో షా ఘోరంగా విఫలమయ్యాడు.  బరోడాపై  జరిగిన టెస్టులో తొలి రెండు ఇన్నింగ్స్ లో వరుసగా 7,  12 పరుగులు చేశాడు. ఆ తర్వాత మహారాష్ట్రపై తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఫిట్ నెస్ పరంగా చూసుకున్నా ఈ యువ ఓపెనర్ బాగా వెనకపడి పోయాడు.ముంబై సెలక్షన్ కమిటీకి షా ఫిట్‌నెస్‌పై తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. త్రిపురతో జరిగే తదుపరి రంజీ ట్రోఫీ మ్యాచ్ నుంచి తప్పించడానికి ఇదే ప్రధాన కారణం. 

Also Read : న్యూజిలాండ్‌కు బిగ్ షాక్..

షా యొక్క శరీర కొవ్వు శాతం 35 శాతం ఉన్నట్టు తెలిపింది. రెండు వారాల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను అనుసరించాలని సెలక్టర్లు షాను ఆదేశించారు. టీమ్‌ఇండియా తరఫున అతడు చివరగా 2021 జులైలో శ్రీలంకతో టీ20 మ్యాచ్‌ ఆడాడు. షా స్థానంలో అఖిల్ హెర్వాడ్కర్‌కు ముంబై జట్టులో స్థానం దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో ముంబై ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడిపోయింది.    అక్టోబర్ 26 నుండి 29 వరకు అగర్తల వేదికగా త్రిపురతో ముంబై తమ తదుపరి మ్యాచ్ ఆడబోతుంది. 

ముంబై జట్టు:

అజింక్యా రహానే (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అఖిల్ హెర్వాడ్కర్, శ్రేయాస్ అయ్యర్, సిద్ధేష్ లాడ్, సూర్యాంశ్ షెడ్గే, హార్దిక్ టామోర్ (వికెట్), సిధాంత్ అద్ధత్రావ్ (వికె), షమ్స్ ములానీ, శర్మాన్ సింగ్ కొఠారి, హిదుల్ సింగ్ కొఠారి, , మోహిత్ అవస్తి, మహమ్మద్ జునేద్ ఖాన్, రాయ్స్టన్ డయాస్