రెడ్​క్రాస్​ సేవల్ని  విస్తరించాలి : గంటా కవితా దేవి

గద్వాల, వెలుగు: రెడ్ క్రాస్  సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రిన్సిపల్  సీనియర్  సివిల్  జడ్జి గంటా కవితా దేవి సూచించారు. బుధవారం ప్రపంచ రెడ్ క్రాస్  దినోత్సవం సందర్భంగా బాలసదన్ లో పండ్లు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్  సొసైటీ వ్యవస్థాపకుడు హెన్సీ డ్యూనంట్ ఫొటోకు పులమాల వేసి నివాళులర్పించారు. సొసైటీ చైర్మన్  రమేశ్, శోభ, సుధారాణి, మోహన్ రావు పాల్గొన్నారు.