ఐఐటీహెచ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు షురూ: ప్రధాని మోదీ

  • వర్చువల్​గా  ప్రారంభించిన ప్రధాని మోదీ

సంగారెడ్డి, వెలుగు: ఐదేండ్లలో భారత్  మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఇండియన్  ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్  టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) క్యాంపస్  డెవలప్‌‌మెంట్ ప్రాజెక్టును ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి గవర్నర్  డాక్టర్  తమిళిసై హాజరయ్యారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ స్టూడెంట్లు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. గవర్నర్  తమిళిసై మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలో ఐఐటీ హైదరాబాద్ టాప్ లో నిలిచిందన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలో టాప్ 8 ర్యాంక్‌‌ తో పాటు ఎన్ఐఆర్ఎఫ్ 2023 ఇన్నొవేషన్‌‌లో ఐఐటీహెచ్  టాప్ 3లో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇన్నొవేటర్లు తక్కువ ధరతో కూడిన వెంటిలేటర్లను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీహెచ్  చైర్మన్  డాక్టర్  బీవీఆర్  మోహన్  రెడ్డి, వెబెక్స్ సుజుకి హిరోషి, సచికో ఇమోటో, డీన్స్, ఫ్యాకల్టీలు, స్టూడెంట్లు పాల్గొన్నారు.