జన ఔషద కేంద్రాల్లోనే మెడిసిన్ కొనాలని ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలోని పేద, దిగువ మధ్య తరగతి ప్రజల కోసమే PM జన్ ఔషదీ పరియోజన తీసుకొచ్చామని మోడీ చెప్పారు. ఇది సేవగానూ, ఉపాధిగానూ ఉపయోపగడుతోందని చెప్పారు. ఈ స్కీమ్ లో రెండున్నర రూపాయలకు అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ లభిస్తున్నాయన్నారు మోడీ. ఇకపై జన ఔషద కేంద్రాల్లో 75 రకాల ఆయుష్ మందులు కూడా అమ్మేలా నిర్ణయం తీసుకున్నామని మోడీ చెప్పారు.ఈ పథకం ద్వారా జన ఔషద కేంద్రాలను నిర్వహించే వారికి ప్రోత్సాహాన్ని రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచుతున్నామన్నారు. జన ఔషద కేంద్రాల్లో 11 కోట్లకు పైగా శానిటరీ న్యాప్‌కిన్లు అమ్ముడయ్యాయన్నారు. గర్భిణీ స్త్రీలకు సప్లిమెంట్స్ కూడా జన ఔషద జనని కింద అందుబాటులో ఉన్నాయన్నారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో 7500 వ జన ఔషద కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు మోడీ.
