రైతు సమస్యలను పరిష్కరించకుండా ప్రధాని మోడీ టీవీ ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతున్నారని ఆరోపించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కొత్త రైతు చట్టాలతో MSP, రాష్ట్ర సేకరణ వ్యవస్థ నీరుగారిపోతుందన్నారు. ప్రైవేట్ కొనుగోలుదారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. రూ.8వేల కోట్ల GST బకాయిలతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ.85వేల కోట్ల వరకు కేంద్రం బకాయి పడిందన్నారు. నిజంగా అంత ప్రేమే ఉంటే అందులో కొంత మొత్తమైనా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ యోజన అమలులో బెంగాల్ సహకరిచడం లేదంటూ కేంద్రం చేసిన ఆరోపణలను ట్విట్టర్ ద్వారా తోసిపుచ్చారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే తమ ప్రభుత్వం దేనికైనా సిద్ధమనేనని… తమ రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నించే వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు మమతా బెనర్జీ.
