11వ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోడీ

11వ పీఎం కిసాన్  నిధులు విడుదల చేయనున్న మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సిమ్లాకు వెళ్లనున్నారు. 8 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా.. సిమ్లాలో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 11 గంటలకు గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లో ఆయన పాల్గొంటారు. అంతేగాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారని పీఎంవో (PMO) తెలిపింది. ఇక గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9.45 గంటలకు సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజా ప్రతినిధులు వారికి సంబంధించిన ప్రాంతాల్లో ప్రజా స్పందన తెలుసుకుంటారని వెల్లడించింది.

ఈ సందర్భంగా సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక్కడి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల ద్వారా తాము లబ్ది పొందడం జరుగుతోందని ప్రజలు వెల్లడించారు. మోడీ రాక కోసం తాము ఎదురు చూస్తున్నట్లు, రైతుల కోసం ఆయన ఎంతగానో చేశారని ప్రశంసించారు. తమ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ సంతోషం వ్యక్తం చేశారు. దేశ పట్ల విశ్వాసం, దేశ ప్రజలుక తమపై విశ్వాసం ఉందన్నారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ విడుదల చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017, డిసెంబర్ 27 తర్వాత.. ప్రధాని సిమ్లాలో సిమ్లాలో పర్యటించడం మొదటిసారి. ఆనాడు రాష్ట్ర రాజధానిలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తల కోసం : -
మరో రికార్డు సృష్టించిన హ్యూమన్ కాలిక్యులేటర్‌


ముక్తినాథ్ కు బయలుదేరి.. అనంత లోకాలకు