జగమే డబ్బు మయం : గుడిలో కొట్టుకున్న పూజారులు..

ఏపీ రాష్ట్రంలో మరో విచిత్రం చోటుచేసుకున్నది. ఆలయంలో పూజారులు కొట్టుకున్నారు. ఉమ్మడి తిరుపతి జిల్లాలో.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. తలకోన శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయంలో దేవుడికి పూజలు చేసే పూజారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ విజువల్స్.. బయటకు రావటంలో వైరల్ అయ్యాయి. 

కార్తీకమాసం సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువైంది. ఈ క్రమంలోనే అర్చకులు.. ప్రధాన ఆలయం అయిన.. సిద్ధేశ్వరస్వామి దగ్గర అర్చకం చేయటానికి పోటీ పడ్డారు పూజారులు. విధుల నిర్వహించే విషయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇవాల్టి డ్యూటీ నాదంటే నాదీ అంటూ పూజారులు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే ఆలయంలోనే.. గర్భగుడి ఎదుటే ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.

ఆ తర్వాత మాటా మాటా పెరిగి.. గుడిలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు పూజారులు. సీసీ కెమెరాలోని విజువల్స్ బయటకు రావటంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన 2024, నవంబర్ 10వ తేదీన జరిగినట్లు తెలుస్తోంది.