శ్రీశైలంలో పురోహితుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌

శ్రీశైలం, వెలుగు : పౌరోహిత్యం చేసుకుంటూ జీవిస్తున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీశైలంలోని లింగాయత్‌‌‌‌‌‌‌‌ సత్రంలో బుధవారం జరిగింది. కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఆదోనికి చెందిన మహేశ్‌‌‌‌‌‌‌‌ (24) శ్రీశైలంలోని బైలు వీరభద్రస్వామి ఆలయంలో పౌరోహిత్యం చేసుకుంటూ స్థానికంగా ఉండే లింగాయత్‌‌‌‌‌‌‌‌ సత్రంలో ఉంటున్నాడు. మహేశ్‌‌‌‌‌‌‌‌ బుధవారం ఉదయం నుంచి రూమ్‌‌‌‌‌‌‌‌ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. మృతదేహాన్ని కిందకు దించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.