ప్రాజెక్టు కోసం భూములు గుంజుకున్నరు

కొల్లాపూర్, వెలుగు: గత ప్రభుత్వం పీఆర్ఎల్ఐ కోసం చెంచుల భూములు గత ప్రభుత్వం గుంజుకొని పరిహారం ఇవ్వకపోవడం సరైంది కాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి ఈశ్వర్  పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఎల్లూరు చెంచుగూడెంలో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్ఐ కోసం ఏడెకరాల భూమి, పీఆర్ఎల్ఐ కోసం డేగలబండ పెంట దగ్గర పదెకరాల భూమిని గత ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకొని పరిహారం అడిగితే కేసులు పెట్టి బొక్కలో వేస్తామని బెదిరించిందని ఆరోపించారు. చెంచులకు గతంలో పట్టాలిస్తే, వాటిని కూడా ఆక్రమించుకున్నారు. కేఎల్ఐ, పీఆర్ఎల్ఐ కోసం భూములను గుంజుకున్న అధికారులపై చర్యలు తీసుకొని, పరిహారం ఇవ్వాలని డిమాండ్  చేశారు. 

ఐటీడీఏ ఆఫీసర్లు స్పందించి ఇతరులు గుంజుకున్న భూములను చెంచులకు ఇప్పించాలని కోరారు. చెంచుపెంటల్లో సౌలతులు కల్పించాలన్నారు. చెంచుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కొల్లాపూర్  ఆర్డీవో ఆఫీస్​ ముందు నిర్వహించే ధర్నాను సక్సెస్​ చేయాలని కోరారు. సలీం, నిమ్మల శివ, లింగస్వామి, కళావతి, మౌనిక, కృష్ణయ్య, ఈరమ్మ, వెంకటయ్య పాల్గొన్నారు.