బీసీ బిల్లుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ

ముషీరాబాద్, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని బీసీ సంఘాలతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, దేశ వ్యాప్తంగా కులాల వారీగా జన గణన చేయాలని చేశారు. ఆయన వెంట బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ నాయకులు నీల వెంకటేశ్, రాఘవేంద్ర, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.