మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రముఖులు

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రముఖులు
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్‌పేయి స్మారక చిహ్నమైన ‘సదైవ్ అటల్’ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్రపతి కోవింద్ నివాళులర్పించారు. వాజ్‌పేయి జయంతిని స్మరించుకొని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వాజ్‌పేయి తన దూరదృష్టితో దేశాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లారని ఆయన అన్నారు. ‘దేశాన్ని బలమైన మరియు సంపన్నమైన దేశంగా మార్చడంలో ఆయన చేసిన కృషిని దేశం యావత్తు గుర్తుంచుకుంటుంది’అని మోడీ ట్వీట్ చేశారు. వాజ్‌పేయి సేవలను గుర్తుకు చేసుకుంటూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాజ్‌పేయి రాసిన కవితలను పంచుకున్నారు. వాజ్‌పేయి గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి అని, ఆయనో మ్యాన్ ఆఫ్ మాస్ అని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ‘వాజ్‌పేయి అసాధారణమైన వక్త, విశిష్ట పండితుడు మరియు ప్రతిభావంతమైన కవి. అన్నింటికంటే.. ఆయన దేశం కోసం ఎంతగానో ఆలోచించిన గొప్ప నాయకుడు’ అని ఆయన అన్నారు. దేశ అభివృద్ధికి, దేశానికి సేవ చేయడంలో వాజ్‌పేయి ఆలోచనలు మరియు ఆయన అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, నిర్మలా సితారామన్, పీయూష్ గోయల్ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. డిసెంబర్ 24,1924న జన్మించిన వాజ్‌పేయి.. తీవ్ర అనారోగ్యంతో ఆగష్టు 16, 2018న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. ఆయన 1998 నుంచి 2004 వరకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. బీజేపీ నుంచి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలి నాయకుడు ఆయనే. వాజ్‌పేయి భారతదేశానికి ప్రధానమంత్రిగా మూడు పర్యాయాలు పని చేశారు. మొదట 1996లో 13 రోజుల కాలానికి, తర్వాత 1998-1999లో 13 నెలల కాలానికి, అనంతరం 1999-2004 వరకు ప్రధానిగా పని చేశారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యులలో వాజ్‌పేయి కూడా ఉన్నారు. వాజ్‌పేయిని బీజేపీ ప్రభుత్వం 2015లో భారత రత్న పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయన ఉత్తమ పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైనందుకు 1994లో గోవింద్ బల్లభ్ పంత్ అవార్డును అందుకున్నారు. For More News.. బాలు చాక్లెట్ విగ్రహం.. ఫోటోలు వైరల్ గోవింద నామస్మరణతో మారుమోగుతున్న తిరుమల నిప్పంటించుకున్న మహిళ.. కాపాడబోయిన సీఐకి మంటలు