చైనా సరిహద్దులో ఎలాంటి కవ్వింపు చర్యలు జరిగినా.. ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. LACకి అవతలి వైపు చైనా సైన్యం మోహరించి ఉందని.. మనవైపు కూడా బలగాలను సన్నద్ధంగా ఉంచామని చెప్పారు. ఎయిర్ ఫోర్స్ 89వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ రాకతో భారత వైమానిక దళ శక్తి మరింత పెరిగిందని చెప్పారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. కశ్మీర్ లో డ్రోన్ దాడులను ఎదుర్కునేందుకు దేశీయంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నామన్నారు.
