టెలికాం కంపెనీలు చార్జీల బాదుడును పెంచేందుకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటి వరకు చార్జీల పెంపుపై మాటలకే పరిమితం అయిన నేపధ్యంలో ఎయిర్ టెల్ దూకుడు ప్రదర్శిస్తూ ఆచరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న కనీస ప్రీపెయిడ్ రీచార్జ్ రూ.49 నుంచి రూ.79కి పెంచేసింది. ఆదాయాన్ని పెంచుకునే దిశలో పోస్టు పెయిడ్ ప్లాన్ ను మార్చిన ఎయిర్ టెల్ తాజాగా ప్రీపెయిడ్ చార్జీలపై కూడా దృష్టి సారించింది.
ప్రీపెయిడ్ కనీస చార్జి రూ.79 చేయడం గురించి వివరిస్తూ పెంపు భారం కనిపించనీయకుండా అవుట్ గోయింగ్ కాల్స్ సమయం నాలుగు రెట్లు పెంచామని.. అలాగే డేటా కూడా డబుల్ ఇస్తున్నామని ప్రకటించింది. ఎయిర్ టెల్ కనీస ప్రీపెయిడ్ చార్జీని పెంచి అందుకు బదులుగా టాక్ టైం.. డేటాను పెంచడంతో.. ఇదే బాటలో మిగిలిన వోడాఫోన్.. రిలయన్స్ జియోలు కూడా కనీస రీచార్జి ప్లాన్లు పెంచే అవకాశం కనిపిస్తోంది.
