- సిద్దిపేట సర్కారు దవాఖానలో ఘటన
సిద్దిపేట రూరల్, వెలుగు: నెలలు నిండకుండా పుట్టిన నవజాత శిశువును ప్రభుత్వ హాస్పిటల్ లో వదిలి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవ జాత మగ శిశువును ఓ వార్డు వద్ద వదిలి వెళ్లినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
గమనించిన సిబ్బంది శిశువును ఎన్ఐసీ వార్డులో అడ్మిట్ చేశారు. శిశువు 900 గ్రాములు మాత్రమే ఉండడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.