మూడో దశ ట్రయల్స్ చేయకుండానే వ్యాక్సిన్‌‌కు అనుమతులా?

మూడో దశ ట్రయల్స్ చేయకుండానే వ్యాక్సిన్‌‌కు అనుమతులా?
న్యూఢిల్లీ: కోవ్యాక్సిన్‌‌తోపాటు కొవిషీల్డ్ టీకాలకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో అత్యవసర వినియోగానికి గాను ఈ వ్యాక్సిన్‌‌లకు ఎక్స్‌‌పర్ట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిపై విపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవ్యాక్సిన్ మూడో ఫేజ్ ట్రయల్స్‌‌లో కొన్ని ప్రోటోకాల్స్‌‌ను అనుసరించలేదని, ఫైనల్ ఫేజ్ ట్రయల్స్ నిర్వహించకుండానే అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.  Bharat Biotech is a first-rate enterprise, but it is puzzling that internationally-accepted protocols relating to phase 3 trials are being modified for Covaxin. Health Minister @drharshvardhan should clarify. pic.twitter.com/5HAWZtmW9s— Jairam Ramesh (@Jairam_Ramesh) January 3, 2021 వ్యాక్సిన్‌‌లకు అనుమతి విషయంలో తప్పనిసరి ప్రోటోకాల్స్‌‌ను పాటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. కొవిషీల్డ్ విషయంలో యూకేలో నిర్వహించిన ఫైనల్ ట్రయల్స్ డేటా వివరాలను కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కోవ్యాక్సిన్ అనుమతిలో కొన్ని నిబంధనలను పాటించలేదని మరో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌‌‌‌కు సంబంధించి అంతర్జాతీయంగా అవలంబిస్తున్న ప్రోటోకాల్స్‌‌ను మార్చారని చెప్పారు. దీని పై ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టత ఇవ్వాలన్నారు.