2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా

2024 ఏడాదిలో 'అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఏదని'(Most Profitable Movie) ఎవ్వరిని అడిగిన వెంటనే చెప్పేది పుష్ప 2. అయితే, ఇక్కడ సమాధానం చెప్పేముందు ఓ విషయం తెలుసుకోవాలి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పుష్ప 2 మూవీ ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో ఉంది. మొదటిది దంగల్. కానీ, 2024 లో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా మాత్రం పుష్ప 2 కాదు. అంతకు ముందు ఓ సినిమా ఉంది. అదే మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు (Premalu) మూవీ. ఈ చిన్న సినిమా భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రేమలు సినిమా ఏకంగా రూ.136 కోట్లు వసూలు చేసింది. అంటే,.. సినిమాకు పెట్టిన బడ్జెట్ కంటే దాదాపు 45 రెట్ల లాభాలను గడించింది.

అదేంటీ.. పుష్ప 2 రూ.1800 కోట్లకి పైగా గ్రాస్ చేసింది.  ప్రేమలు వసూళ్లు చేసింది జస్ట్ రూ.136 కోట్లు కదా.. అలా ఎలా ఎక్కువ అంటారు? అని మాత్రం అనుకోవొద్దు. పుష్ప 2 కలెక్షన్స్ లాగే బడ్జెట్ కూడా ఎక్కువే. పెట్టిన బడ్జెట్ని బట్టి కలెక్షన్స్ లాభాల రెట్లు మాట్లాడుకుంటారనే విషయం గుర్తించుకోవాలి.

ప్రేమలు మూవీకి పెట్టింది జస్ట్ 3 కోట్లు.. వచ్చింది136 కోట్లు. ఇది కదా లెక్కంటే. కనుకే, 2024 ఏడాదిలో ఏ భారతీయ సినిమా కూడా ఇన్ని రెట్ల లాభాలు సంపాదించలేకపోయాయి. పుష్ప 2 (రూ.350 కోట్లు), కల్కి 2898 AD(రూ.600కోట్లు) బడ్జెట్ పెట్టడంతో.. రూ.1000 కోట్లకి పైగా లాభాలు వచ్చాయి. అంటే, పుష్ప 2కు పెట్టిన బడ్జెట్లో ఓ 5 రేట్లు మాత్రమే లాభాలు అందుకుందని అర్ధం.

ప్రేమలు గురించి:

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రేమలు సినిమా గురించే చర్చ నడిచింది. మలయాళంలో ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపధ్యంలో రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దీంతో తెలుగులో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మార్చ్ 8న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. ఒక సినిమా చూస్తూ ఈ రేంజ్లో నవ్వి చాలా కాలమైంది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రేమలు సినిమా గురించి చెప్పడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపించారు.