Lanka T10 League: లంక టీ10 లీగ్‌.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో భారత ఓనర్ అరెస్ట్

లంక టీ10 లీగ్‌లో భారత ఫ్రాంచైజీని శ్రీలంక స్పోర్ట్స్ పోలీసులు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టు చేశారు. లంక టీ10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ప్రేమ్ ఠాకూర్‌ను గురువారం (డిసెంబర్ 13) అరెస్టు చేయడం సంచలనంగా మారింది. క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో జరుగుతున్న మ్యాచ్ లో ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. లంక T10 సూపర్ లీగ్‌లో ప్రేమ్ ఠాకూర్‌  'గాలే మార్వెల్స్' జట్టు యజమానిగా వ్యవహరిస్తున్నాడు. అతడిని శుక్రవారం కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

టోర్నీలోని ఆరు జట్లలో గాలె మార్వెల్స్ ఒకటి. మ్యాచ్‌ను ఫిక్స్ చేయాలని తనని కోరారని..అయితే అందుకు తాను ఒప్పుకోలేదని  వెస్టిండీస్‌ ఆటగాడు ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం ప్రేమ్ ఠాకూర్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను కోర్టులో హాజరుపరిచి న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటుంది. లంక టీ10 లీగ్ 2024 సీజన్ డిసెంబర్ 11న పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. తొలిసారిగా ఈ టోర్నీ ప్రారంభించడంతో భారీ హైప్ నెలకొంది. అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణలు షాకింగ్ కు గురి చేస్తున్నాయి. 

Also Read :- ఆస్ట్రేలియా బ్యాటింగ్.. తొలి సెషన్‌కు వర్షం అంతరాయం

లంక లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు జరగడం ఇదే తొలి సారి కాదు. అవినీతి ఆరోపణలపై ఈ ఏడాది ప్రారంభంలో, శ్రీలంక స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ ఆరు నెలల సస్పెన్షన్‌తో ఒక సంవత్సరం పాటు అన్ని రకాల క్రికెట్‌లు ఆడకుండా ICC నిషేధించింది. ఐసీసీ  అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఆయన అంగీకరించడంతో నిషేధం విధించబడింది.