బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగం రద్దు అయినట్లే : ప్రవీణ్​ కుమార్​

పెబ్బేరు, వెలుగు : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ఇస్తే   రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, రిజర్వేషన్లు అన్నీ తీసేసి పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తారని నాగర్​కర్నూల్​ పార్లమెంటు బీఆర్​ఎస్​   అభ్యర్థి ఆర్​ ఎస్​ ప్రవీణ్​ కుమార్​ అన్నారు. 

మంగళవారం మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డితో కలిసి వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో ప్రచారం చేశారు.  పెబ్బేరు సుభాష్ చౌరస్తాలో   మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ కరుణశ్రీ, వైస్​ చైర్మన్​ కర్రెస్వామి  పాల్గొన్నారు.