ప్రశాంత్ కిషోర్..రాజకీయ వ్యూహకర్తగా మంచి పేరుంది.రాజకీయ వ్యూహాలు,ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో దిట్ట.అందుకే పీకే పొలిటికల్ సర్కిల్స్ లో చాలా పాపులర్. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనే విషయాలపై పీకేకు బాగా తెలుసు. అందుకు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీల తరపున పనిచేసి విజయపథంలో నడిపించడంలో ప్రశాంత్ కిషోర్ ప్రధాన ప్రాత్ర పోషించారు.
పీకే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతురాని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన చేరికపై కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది. పీకేని తన సభ్యుడిగా చేయాలని కాంగ్రెస్ భావించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రాండ్ ఓల్డ్ పార్టీని ఎలా పునరుద్ధరించాలనే దానిపై వారం రోజులపాటు సమావేశాలు, సుదీర్ఘ మంతనాలు,ప్రజెంటేషన్లతో నిమగ్నమైన పీకే చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ట్విస్ట్ ఇచ్చారు.
కట్ చేస్తే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నట్లు పీకే ఇవాళ ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రయాణం బిహార్ నుంచే ఉంటుందని చెప్పారు. ప్రజలకు అవసరమైన పాలసీల తయారీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్నానని..ఇప్పుడు రియల్ మాస్టర్ గా మారే సమయం వచ్చిందన్నారు. అంశాలను మరింతగా అర్థం చేసుకునేందుకు జన్ సురాజ్ పేరుతో కొత్త పార్టీతో వస్తున్నానని చెప్పారు. ఇప్పటికే పీకే ప్రత్యక్షంగా..పరోక్షంగా వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
బిహార్ లోని కిషోర్ రోహ్తాస్ జిల్లాలోని కోనార్ పీకే సొంతూరు. తండ్రి శ్రీకాంగ్ పాండే సాధారణ వైద్యుడు. వృత్తి రీత్యా బిహార్ లోని బక్సార్ లో నివాసముండేవారు. బక్సార్ లోనే పీకే రాజకీయ పాఠాలు చదువుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ప్రశాంత్ కిషోర్ ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో సేవలందించారు.
2013లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నన్స్ ను స్థాపించాడు. ప్రశాంత్ కిషోర్ బీహార్ జనతాదళ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు యువతను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను అందుకున్నారు.అందులో కొంతమేర విజయం సాధించినట్లుగా భావించారు. జేడీయూలో నితీష్ తర్వాత సెకండ్ ప్లేస్ పీకేదే. కానీ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడంతో నితీష్, పీకేల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2020 జనవరి 29 పార్టీ నుంచి పీకేను బహిష్కరించారు.
2021లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఏపీలో వైసీపీ అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించారు పీకే.అలాగే 2020లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు.2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీకి సలహాలు, సూచనలు ఇచ్చారు పీకే . ఆ ఎన్నికల్లో కమలం పార్టీ ఘన విజయం సాధించడంతో పాపులర్ అయ్యారు.అయితే ఒక్కోసారి ఒక్కోపార్టీతో కలిసి పనిచేసే పీకేకు సిద్ధాంతాలు లేవని.. అధికారమే తన సిద్ధాంతమని కొందరు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం
రష్యా సైనికులను చెచెన్ ఫైటర్లే కాల్చిచంపిన్రు
మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం!
