Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకు.. ఎక్కడ..?

బీహార్​లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పేపర్​లీకేజ్​వ్యవహారం దుమారం రేపుతోంది. ఎన్నికల వ్యూహకర్త, జన్​సూరజ్​ పార్టీ అధినేత ప్రశాంత్​ కిషోర్​అమరణ నిరాహార దీక్ష దిగారు. బీహార్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (BPSC) పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ.. నిరుద్యోగులతో కలిసి పాట్నాలోని గాంధీ మైదాన్​ లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు కూర్చున్నారు. BPSC పరీక్ష ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల కోసం వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తమ దగ్గర సమాచారం ఉందని BPSC 2024 పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ గత కొంతకాలంగా అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 

బీహార్ రాష్ట్ర ప్రభుత్వం BPSC 2024 ఎగ్జామ్ నిర్వహించింది. 900 కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎగ్జామ్స్ కు దాదాపు ఐదు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యా రు. అయితే పాట్నాలోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో ప్రశ్నపత్రాలు లీకయ్యారని పరీక్షను బహిష్కరించి ఆందోళనకు దిగారు. 

ALSO READ | కుక్కే తన ప్రపంచం.. అది లేని జీవితం వద్దనుకున్నాడు

ఎగ్జామ్స్​ ప్రశ్నాపత్రాల లీకేజీపై స్పందించిన బీహార్​ ప్రభుత్వం...పేపర్ లీకైన సెంటర్ లో  ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులకు మాత్రమే తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.. అయితే అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. ఇది లెవెల్​ ప్లేయింగ్ ఫీల్డ్​ సూత్రానికి విరుద్దమని.. అభ్యర్థులందరికీ బీపీఎస్సీ  మళ్లీఎగ్జామ్స్ నిర్వహించాలని డిమాండ్​ చేస్తూ ఆందోళనకు దిగారు. 

నిరుద్యోగులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్​ మాట్లాడుతూ.. బీపీఎస్సీలో అవినీతి రాజ్యమేలుతోంది.. ఎగ్జామ్స్​ నిర్వహణకు ముందే అన్ని పోస్టులు అమ్ముకున్నారు.. కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు.