కాంగ్రెస్ కు ఝలక్..టీఎంసీలో చేరిన ప్రణబ్ తనయుడు

కాంగ్రెస్ కు ఝలక్..టీఎంసీలో చేరిన ప్రణబ్ తనయుడు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. కోల్ కతాలోని TMC ఆఫీస్ లో అభిజిత్ కు TMC నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్ లో ఉన్న అభిజిత్ సడెన్ గా TMC లో జాయినయ్యారు. 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో... ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు అభిజిత్. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు. అయితే 2019లో అభిజిత్ ఓటమి పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ మొదలు పెట్టిన మతపరమైన హింసను మమతా బెనర్జీ సమర్థవంతంగా అదుపు చేశారని అభిజిత్ చెప్పారు. దేశమంతటా బీజేపీని కంట్రోల్ చేసే శక్తి ఆమెకు ఉందన్నారు. కాంగ్రెస్ లో ప్రాథమిక సభ్యత్వం తప్ప తనకు ఎలాంటి పొజిషన్ లేదని... TMCలోనూ సాధారణ సైనికుడిగానే చేరినట్టు అభిజిత్ తెలిపారు. పార్టీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు.