నన్ను కొనేంత దమ్ము బీజేపీకి లేదు.. ప్రకాష్ రాజ్

ప్రధాని మోడీపై, ఎన్డీఏ ప్రభుత్వ విధివిధానాల మీద ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తరచూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు బహిరంగంగాను ప్రకాష్ రాజ్ బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తుంటాడు. అలాంటి ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరనున్నాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందిస్తూ ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశాడు. నన్ను కొనేంత సైద్ధాంతిక బలం బీజేపీకి లేదని వ్యంగ్యంగా స్పందించాడు ప్రకాష్ రాజ్.

 

ప్రకాష్ రాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీపై వివాదాస్పద కామెంట్స్ చేయటం ప్రకాష్ రాజ్ కి కొత్తేమి కాదు గతంలో చంద్రయాన్ 3 లాంచింగ్ సమయంలో కూడా ప్రధాని మోడీని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశాడు. చంద్రయాన్ సక్సెస్ అయ్యాక  వచ్చే మొదటి ఫోటో ఇదేనంటూ ఒక వ్యక్తి చంద్రమండలం మీద టీ అమ్ముతున్న కార్టూన్ ని ట్వీట్ చేశాడు ప్రకాష్ రాజ్. ఆ సమయంలో నెట్టింట విమర్శలు వెల్లువెత్తడంతో జోక్ చేశానని వివరణ ఇచ్చాడు. 

ALSO READ :- SRH vs CSK మ్యాచ్.. ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు