అగ్రి చట్టాలపై రాహుల్ గాంధీ చర్చకు సిద్ధమా

అగ్రి చట్టాలపై రాహుల్ గాంధీ చర్చకు సిద్ధమా
కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) లకు సవాల్ విసిరారు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవడేకర్. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలపై చర్చకు తాను సిద్ధమనీ..దీనికి మీరు రెడీనా అంటూ రాహుల్ కు సవాల్ విసిరారు. కేంద్రం రైతులకు అనుగుణంగా వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిందా.. లేదా అన్న దానిపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల కేంద్రాన్ని వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయనకు నేను బహిరంగ సవాల్ చేస్తున్నానని అన్నారు జావడేకర్. వ్యవసాయ బిల్లులు మంచివా కాదా, రైతులకు మేలు చేస్తాయా అనే దానిపై రాహుల్‌ డిబేట్‌కు రావాలని డిమాండ్ చేశారు.