Krishna Floods: ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..ప్రకాశం బ్యారేజ్ గేట్లు మళ్లీ ఎత్తివేత..!!

Heavy Rains Cause Flooding in Krishna Basin: కృష్ణా నది వద్ద మళ్లీ వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు మళ్లీ ఎత్తేశారు. ప్రకాశం బ్యారేజ్ ఎక్కువ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి వరద.. మళ్లీ భయంకరమైన స్థాయిలో పెరిగింది.

దీంతో ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తారు అధికారులు. ఈ నేపథ్యంలోనే 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం పడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ జిల్లాలో ఉన్నవారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ALSO READ | తూ.గో. జిల్లాలో భారీ వర్షాలు... వరద ముంపులో లంక గ్రామాలు..