విజయవాడ: కొద్దిసేపటి క్రితం ప్రకాశం బ్యారేజీ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ఎగువ నుండి వరద రాకున్నా స్థానిక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదిలో వరద క్రమం క్రమంగా పెరుతోంది. నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో ప్రకాశం బ్యారేజీ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. 1450 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మున్నేరు వాగు నుంచి ప్రకాశం బ్యారేజీకి 11 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేశారు. బ్యారేజీకి దిగువన తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడం ఈ సీజన్లో ఇదే తొలిసారి.




