డిసెంబర్​ 16న ప్రజావాణి రద్దు

వికారాబాద్​, వెలుగు : జిల్లాలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. గ్రూప్ -2 పరీక్షల నేపథ్యంలో అధికారులంరూ పరీక్ష విధులకు హాజరు కావడం తో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రాకూడదని  ఆయన తెలిపారు.