సంగారెడ్డి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి దామోదర

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా  వైద్య ,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జాతీయ జెండా ను ఆవిష్కరించారు.  తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి  అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లా పోలీసులచే  గౌరవ వందనాన్ని స్వీకరించారు. 

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ...  రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిందని.. అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు స్వాతంత్ర సమరయోధులందరికీ నివాళులు  అర్పించారు.  హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో చేరి నేటికీ 77 వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక , విద్యార్థినీ, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు  మంత్రి దామోదర్ రాజనర్సింహ శుభాకాంక్షలు తెలియజేశారు.