చంద్రబాబుకో న్యాయమా..అల్లు అర్జున్ కు మరో న్యాయమా: కేఏ పాల్

సిని నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ను ప్రజాశాంతి పార్టీ నేత కేఏపాల్ తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయకపోతే కోర్టుకెళతానన్నారు. 2019లో జరిగిన పుష్కరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటకలో 23 మంది చనిపోయారు. అప్పడు అయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్ట్ చేశారు.. చంద్రబాబుకో న్యాయం.. అల్లు అర్జున్ కో న్యాయమా కేఏ పాల్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయకపోతే పోతే.. ఆర్టికల్14(ఎ)  ఉల్లంఘన కింద కోర్టుకెళ్తానన్నారు.

ALSO READ | చిరంజీవి వెళ్లేది పోలీస్ స్టేషన్‌కు కాదు.. అల్లు అర్జున్ ఇంటికి

ఇటీవల హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ చనిపోవడం, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం( డిసెంబర్13) చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు.