- విద్యార్థి, మహిళా, యూత్ వింగ్‌లకు మినహాయింపు
- పవార్ నిర్ణయాన్ని ప్రకటించిన ప్రఫుల్ పటేల్
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన అన్ని విభాగాలను, సెల్స్‌ను రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ శరద్ పవార్ అప్రూవల్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. విద్యార్థి, మహిళా, యూత్ విభాగాలకు రద్దు నుంచి మినహాయింపు ఇచ్చినట్టు వివరించారు. అయితే ఎందుకు రద్దు చేశారనే దానిపై మాత్రం ప్రఫుల్ పటేల్ క్లారిటీ ఇవ్వలేదు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం కూలిపోయిన మూడు వారాల తరువాత.. ఎన్సీపీ ఈ నిర్ణయం తీసుకుంది. బాల్‌థాక్రే నేతృత్వంలో ఏర్పడిన ఎంవీఏ సర్కార్‌లో ఎన్సీపీ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే శాసన సభ్యుల మద్దతు కూడగట్టుకుని బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
