PM-కిసాన్ నిధులను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు రూ.18 వేల కోట్లను రిలీజ్ చేశారు. దీంతో రాష్ట్రంలోని 39 లక్షల మంది రైతులకి సాయం అందనుండగా.. ఒక్కో రైతుకు రూ.2 వేలు డిపాజిట్ అవుతున్నాయి. ఇప్పటికే ఆరు విడుతల డబ్బులు డిపాజిట్ చేయగా..ఇవి ఏడో విడత డబ్బులు. ఈ పథకాన్ని ప్రధాని మోడీ 2019లో ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ నిధులు అందిస్తున్నారు. ఒక్కో రైతుకు 6వేల రూపాయలు సాయం అందే ఈ పథకం కింద మూడు వాయిదాల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. సాగు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
