ఏడాదిలో 25,816 కు నిఫ్టీ

ఏడాదిలో 25,816 కు నిఫ్టీ
  • అంచనా వేస్తున్న ప్రభుదాస్ లీలాధర్ 

న్యూఢిల్లీ : ఇంకో ఏడాది కాలంలో బెంచ్‌‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 25,816 లెవెల్‌‌కు చేరుకుంటుందని బ్రోకరేజ్ కంపెనీ ప్రభుదాస్ లీలాధర్‌‌‌‌  అంచనా వేస్తోంది. యూనియన్ బడ్జెట్‌‌ మెప్పిస్తుందని,  సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఇన్వెస్ట్‌‌మెంట్స్ భారీగా వస్తాయని ఈ కంపెనీ అంచనా వేస్తోంది.  ఎన్‌‌డీఏ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌పై  ఫోకస్ కొనసాగిస్తుందని, ముఖ్యంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్‌‌ (పీఎల్‌‌ఐ) సెక్టార్లు, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్‌‌కు పెద్ద పీట వేస్తుందని పేర్కొంది.  

రోడ్లు, పోర్టులు, ఏవియేషన్‌‌, డిఫెన్స్‌‌, రైల్వేస్‌‌, గ్రీన్ ఎనర్జీ కోసం భారీగా ఖర్చు చేస్తుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్‌‌  20 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని, సాధారణ వర్షపాతం ఉంటుందని ప్రభుదాస్‌‌ లీలాధర్ అంచనావేసింది.  బ్యాంకులు, హెల్త్‌‌కేర్‌‌‌‌, కన్జూమర్‌‌‌‌, ఆటోమొబైల్‌‌ సెక్టార్లపై పాజిటివ్‌‌గా ఉంది.