SL vs NZ 2024: ప్రభాత్ అదరహో.. అశ్విన్, కమ్మిన్స్‌ను మించిపోయిన లంక స్పిన్నర్

శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య  టెస్ట్ క్రికెట్ లో తగ్గేదే లేదంటున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను చుట్టేస్తున్నాడు. స్వదేశంలో మ్యాచ్ జరిగితే చాలు ఒంటి చేత్తో లంకకు విజయాలను అందిస్తున్నాడు. ముఖ్యంగా గాలేలో ఈ 32 ఏళ్ళ స్పిన్నర్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఆడిన 16 మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ లకే ప్రపంచ క్రికెట్ ను తనవైపు తిప్పుకుంటున్నాడు. ఇప్పటివరకు 16 మ్యాచ్ ల్లో ఏకంగా 97 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో తాను టీమిండియా స్పిన్నర్ అశ్విన్.. ఆసీస్ సఫాస్ట్ బౌలర్ కమ్మిన్స్‌ దాటిపోయాడు. 

2021 లో టెస్ట్ అరంగేట్రం చేసిన ప్రభాత్..ఇప్పటివరకు ఏకంగా 9 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకోవడం విశేషం. ఒక మ్యాచ్ లో 10 వికెట్ల ఘనతను రెండు సార్లు అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో 2021 నుంచి అత్యధిక సార్లు 5 వికెట్ల తీసిన ప్లేయర్ గా నిలిచాడు. మొత్తం 30 ఇన్నింగ్స్ ల్లో ప్రభాత్ 9 సార్లు 5 వికెట్లు పడగొడితే.. అశ్విన్ 7 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. కమ్మిన్స్ 35 మ్యాచ్ ల్లో 5 సార్లు.. లియాన్ 36 ఇన్నింగ్స్ ల్లో నాలుగు సార్లు 5 వికెట్ల ఫీట్ ను సాధించారు.

ALSO READ | SL vs NZ 2024: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. భారత్, ఆసీస్‌ను వణికిస్తున్న శ్రీలంక

స్వదేశంలో శ్రీలంకలో తాజాగా న్యూజిలాండ్ తో ముగిసిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లు కలిపి 9 వికెట్లతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను గెలుచుకున్నాడు. రెండో టెస్టులోనూ చెలరేగి 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.    జయసూర్య కెరీర్ కళ్లు చెదిరే రీతిలో ప్రారంభమైంది. 2022లో అతను ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే 12 వికెట్లు తీసుకొని ఔరా అనిపించాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ ఆరేసి వికెట్లు తీశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ తో జరిగిన రెండు టెస్టుల్లో మరో 17 వికెట్లు తీసుకున్నాడు. ఆ సిరీస్ లోనూ రెండుసార్లు ఐదుకుపైగా వికెట్లు తీశాడు.

2023 లో ఐర్లాండ్‌ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసి తన 50వ టెస్టు వికెట్‌ని సాధించి 71 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. జయసూర్య తన ఏడో టెస్టులో 50 వికెట్ల మార్క్‌ను కొట్టి వెస్టిండీస్‌కు చెందిన ఆల్ఫ్ వాలెంటైన్ రికార్డును బ్రేక్ చేశాడు.తక్కువ మ్యాచ్‌లలో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్న స్పిన్నర్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌలర్ రికార్డు ఇప్పటికీ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ చార్లీ టర్నర్ పేరిటే ఉంది. అతడు 1988లో ఇంగ్లండ్ తో తన ఆరో టెస్టులోనే 50 వికెట్లు తీశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)