పవర్​గ్రిడ్‌లో ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాలు

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ కార్యాలయాల్లో 802 డిప్లొమా ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీకాం, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఏ/ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 12 నవంబర్​ 2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), కంప్యూటర్ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్స్: ఆన్​లైన్​లో నవంబర్​ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష జనవరి/ ఫిబ్రవరి 2025లో నిర్వహిస్తారు.