శివ్వంపేట, వెలుగు : ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే అసలైన రైతులకే పరిహారం ఇవ్వాలంటూ మంగళవారం మెదక్‌జిల్లా శివ్వంపేట తహసీల్దార్ఆఫీస్ ముందు పోతులబోగుడ రైతులు ఆందోళన చేశారు. రెవెన్యూ అధికారులు మంగళవారం ట్రిపుల్ ఆర్రోడ్డులో భూములు కోల్పోతున్న గ్రామ రైతులతో తహసీల్దార్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 44 ఎకరాల్లో 53 మంది రైతులు కబ్జాలో ఉండగా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వేరే రైతుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు.
అధికారులు చేసిన తప్పిదం వల్ల సర్వే నంబర్ ఒక దగ్గర, భూములు ఒక దగ్గర ఉన్నాయన్నారు. భూములు లేని వారికి పాస్‌బుక్స్ ఇచ్చారని, వారికి రైతుబంధు కూడా వస్తోందన్నారు. ఇప్పుడు రికార్డులో ఎవరి పేరుంటే వారికే పరిహారం వస్తుందని అధికారులు అనడం కరెక్ట్‌కాదన్నారు. ఫీల్డ్‌లో సర్వే నిర్వహించి కాస్తులో ఉన్న అసలైన రైతులకే నష్టపరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పారు.