జనసేనకు బిగ్ షాక్.. పోతిన మహేష్ రాజీనామా

ఏపీ ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ ఇన్‌ఛార్జ్ పోతిన మహేష్  తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా   చేశారు. ఈ  మేరకు తనరాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పంపించారు. విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి కేటాయించడంతో పోతిన మహేష్ కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. 

జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకు మరియు క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇప్పటి వరకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జనసైనికులకు మరియు పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదములు అని మహేష్ తన లేఖలో పేర్కొన్నారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరుపున సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. 

జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్‌ను నమ్ముకునే తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.   2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన పోతిన మహేష్.. ఓటమి పాలయ్యారు.